Home » అటల్ బిహారీ వాజ్ పేయి కి నివాళులర్పించిన బీజేపీ నాయకులు

అటల్ బిహారీ వాజ్ పేయి కి నివాళులర్పించిన బీజేపీ నాయకులు

by Admin
12.6kViews
94 Shares

తెలంగాణ మిర్రర్, శంకర్ పల్లి : శంకర్పల్లి మండలం మోకిలా బీజేపీ కార్యాలయంలో శంకర్పల్లి మండల అధ్యక్షులు రాములు గౌడ్ ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్ పేయి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి సీనియర్ నాయకులు వర్రి తులసి రామ్ విజయకుమార్ హాజరైనారు. ఈ సందర్బంగా ఆయన  మాట్లాడుతూ వాజ్ పేయి  దేశానికి చేసిన సేవలు మరువలేనివి ఆయన పార్టీ గురించి దేశం గురించి ఎంతో తపన పడ్డారని ఆ మహానుభావుని ఒకసారి స్మరించుకుంటూ, నివాళులర్పించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, రాజచంద్ర, మండల ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి, మండల బీసీ అధ్యక్షులు కృష్ణ, మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు ధరన్ సింగ్, మండల బిజెపి ఉపాధ్యక్షులు హరినాథ్, కొండకల్ శక్తి కేంద్రం ఇంచార్జ్ రామ్ రెడ్డి, ప్రొద్దుటూరు శక్తి కేంద్రం ఇంచార్జ్ సంజీవరెడ్డి, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి హరిచారి, జన్వాడ శక్తి కేంద్రం ఇంచార్జ్ కుమార్, గ్రామ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్, మాసాని గూడ శక్తి కేంద్రం ఇన్చార్జులు మల్లేష్ గౌడ్, ఎల్వర్తి శక్తి కేంద్రం ఇంచార్జ్ నర్సింలు, సంకేపల్లి శక్తి కేంద్రం ఇంచార్జ్ చంద్రశేఖర్, ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి నరేష్ కుమార్, బూత్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ,వెంకటేష్, నరసింహులు, మోకిలా మాజీ అధ్యక్షులు కరుణాకర్ చారి, నాయకులు రాజేశ్వర్, మురళి, సాయికుమార్, లక్ష్మీనారాయణ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment