
తెలంగాణ మిర్రర్, చేవెళ్ల : చేవెళ్ల మండల కేంద్రంలోని శంకర్పల్లి చౌరస్తా లో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరించిన ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య. అనంతరం ఏర్పాటు చేసిన సభలో తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, సాంసృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…17వ శతాబ్దం లో 12 మంది సైన్యం తో ప్రారంభమైన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 12000వేళ సైన్యాన్ని ఏర్పాటు చేసే దొరలను ఎదిరించి రాజ్యాధి కారాన్ని సాధించాడని తెలిపారు. ఆనాడు పాలకుల వల్ల కులవృత్తులకు ఎంతో అన్యాయం జరిగిందని నేడు కేసిఆర్ పాలనలో అన్ని వర్గాల వారికి న్యాయం జరిగిందని అన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్బంగా ఆయన తెలియజేశారు. సర్వాయి పాపన్న జయంతి ఆగస్టు 18న, వర్ధంతిని ఏప్రిల్ 2న తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని 2022 అక్టోబర్ 30న ఉత్తర్వులు జారీ చేసింది అని వివరించారు.