Home » మట్టి వినాయకుల ను పూజిద్దాం పర్యావరణం ను పరిరక్షిద్దాం..

మట్టి వినాయకుల ను పూజిద్దాం పర్యావరణం ను పరిరక్షిద్దాం..

by Admin
500Views

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి:  శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం ప్రాంగణంలో జిహెచ్ఎంసి  శేరిలింగంపల్లి సర్కిల్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయకుల ప్రతిమల పంపిణీ కార్యక్రమంలో  డీసీ వెంకన్న, ఎఎంఒహెచ్ రవి కుమార్, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ లతో కలిసి పంపిణీ చేసిన అరెకపూడి గాంధీ. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లడుతూ భవిష్యత్ తరాల ను దృష్టిలో పెట్టుకొని పర్యవరణ పరిరక్షణలో భాగంగా పర్యావరణ హితం ప్రతి ఒక్కరు మట్టి వినాయకులను పూజించాలని సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన వినాయక విగ్రహాల ద్వారా చెరువులు కలుషితం అవుతాయి అని, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది అని అన్నారు. కావున భావితరాలను దృష్టిలో పెట్టుకొని మట్టి వినాయక విగ్రహాలను ప్రతి ఒక్కరు తప్పకుండా పూజించి పర్యావరణంను పరిరక్షించాలని ప్రభుత్వ విప్ గాంధీ కోరారు.  ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ మన్వి, శానిటేషన్ సూపర్ వైజర్ జలందర్ మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, హఫీజ్పెట్ డివిజన్ అధ్యక్షులు గౌతమ్ గౌడ్, తెరాస నాయకులు మిరియాల రాఘవ రావు, కరుణాకర్ గౌడ్, రవీందర్ రెడ్డి, కాశినాథ్ యాదవ్, వెంకటేష్ , దాస్ , యశవంత్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment