
*ప్రొద్దుటూరు లో రెండో విడత గొల్లకురుమలకు గొర్రెల పంపిణీ.
*కురుమ సంఘం భవనా నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేసిన ఎమ్మెల్యే కాలే యాదయ్య.
తెలంగాణ మిర్రర్, శంకర్ పల్లి : చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లి మండలం పొద్దుటూరు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన రెండో విడత గొర్రెల పంపిణి గొర్రెల ఆరు యూనిట్లను శుక్రవారం ఎమ్మెల్యే కాలే యాదయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామానికి 36 యూనిట్లు మంజూరు కాగ 6 యూనిట్లు గొర్రెలను గొల్ల కురుమలకు పంపిణీ చేశామని గొల్ల కురుమల జీవితాల్లో వెలుగులు నింపుతున్న గొప్ప కార్యక్రమమే గొర్రెల పంపిణీ పథకం అని ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. తెలంగాణ సబ్బండ కులాల జీవనంలో గుణాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం లో గొల్ల కురుపులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక స్థానాన్ని కల్పించారని తెలిపారు. అదేవిదంగా గ్రామంలో కురుమల భవన నిర్మాణానికి 10 లక్షల రూపాయలను ఈ సందర్బంగా ఆయన మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, జెడ్పిటిసి గోవిందమ్మ, గోపాల్ రెడ్డి, AMC చైర్మన్ పాపారావు, మోహన్ రెడ్డి, ఎంపిటిసిల పోరు మాజీ అధ్యక్షులు బొల్లారం వెంకట్ రెడ్డి, గ్రామ సర్పంచ్ నరసింహారెడ్డి, వార్డు సభ్యులు, బిఆర్ఎస్ నాయకులు గ్రామస్తులు, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.