Home » స్వచ్ఛత విషయంలో నిర్లక్ష్యం వహించరాదు – ఉప్పలపాటి శ్రీకాంత్ 

స్వచ్ఛత విషయంలో నిర్లక్ష్యం వహించరాదు – ఉప్పలపాటి శ్రీకాంత్ 

by Admin
9.8kViews
117 Shares

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి :  స్వచ్ఛత విషయంలో నిర్లక్ష్యం వహించరాదని మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పేర్కొన్నారు. మంగళవారం మియాపూర్ డివిజన్ పరిధిలోని జయప్రకాష్ నారాయణ నగర్ కాలనీలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు చెత్త సేకరణ బుట్టలను అందజేశారు. ఈ సంధర్భంగా కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రతి ఒక్క పారిశుద్ధ్య కార్మికులు ప్రతి ఇంటిలోని చెత్తను స్వచ్ఛ ఆటోలలో వేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి ఇంటికి తిరిగి చెత్తను సేకరించాలని, స్వచ్ఛత విషయంలో అలసత్వం వహించకుండా, కాలనీలను పరిశుభ్రంగా ఉంచాలని జీహెచ్ఎంసి అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ ఎస్ఆర్పీలు కనకరాజు, ఎస్ఎఫ్ఏలు మహేష్, అగమయ్యా, సునీల్ స్థానికులు అన్ని రాజు, రామాంజనేయ రెడ్డి, అశోక్ కుమార్, వెంకట్ రెడ్డి లతో పాటు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment