
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సెంట్రల్ కమిటి శేరిలింగంపల్లి అసెంబ్లీ కన్వీనర్ గా జ్ఞానేంద్ర ప్రసాదను నియమించారు. అలాగే మంగళవారం జరిగిన గచ్చిబౌలి పరిధిలోని సైబరాబాద్ కమిషనరేట్ లో పోలీస్ కమిషనర్ అధ్యక్షతన ఉన్నతాధికారులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సెంట్రల్ కమిటీ సభ్యులతో కలసి గణేష ఉత్సవాల్లో భాగంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని అని వినాయక మండపలు నిమజ్జనం ప్రాంతాల్లో విధి దీపాలు,కరెంటు వైర్లు, డ్రైనేజీలు,చెరువుల శుభ్రత,ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష సమావేశంలో అధికారులకు విన్నవించుకోవడం జరిగింది.నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్యలున్న ఇబ్బందులున్నా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సబ్యులకు తెలియజేయాలని కోరారు. అలాగే శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని అని డివిజన్లలో కన్వీనర్లు, కో కన్వీనర్లు కమిటీలు వేసుకొని సమావేశాలు నిర్వహిస్తున్నారు అని అన్నారు. అలాగే గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా కవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ ఉత్సవాలను ఘనంగా సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ ఉత్సవాలను నిర్వహించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పెద్దలు రాఘవరెడ్డి, భగవంత్ రావు,రామారావు, మురారి, బద్దం మహిపాల్ , రమేష్ , జ్ఞానేంద్ర ప్రసాద్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు.