Home » ప్రేమ పేరుతో బాలికని మోసం చేసిన యువకుడు

ప్రేమ పేరుతో బాలికని మోసం చేసిన యువకుడు

by Admin
9.0kViews
102 Shares

తెలంగాణ మిర్రర్, శంకర్ పల్లి :   ప్రేమ పేరుతో మైనర్ బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేసిన శంకర్ పల్లి  మండల్ మోకిల  పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. యువకుడు పై మోకిలా పోలీసులు కేసు నమోదు చేసి శనివారం రిమాండ్ కు తరలించారు. పోలీసుల వివరాలప్రకారం.. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఓ మార్వాడి కుటుంబం గత కొన్నాళ్ల నుంచి మండల పరిధిలో గ్రామంలో నివాసం ఉంటుంది, మోకిలా గ్రామానికి చెందిన ఎండి ఆసిఫ్ మార్వాడి కుటుంబం లోని బాలికపై ప్రేమ పేరుతో ప్రేమిస్తున్నానంటూ మైనర్ బాలికను ఆసిఫ్ నమ్మించాడు. అదేవిధంగా బాలికను జులై చివరి వారంలో తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారం చేశాడు. కాగా బాలిక తండ్రి ఈనెల 16న మోకిలా పోలీసులకు ఫిర్యాదు చేశాడు దీంతో కేవలం రెండు రోజుల్లోనే యువకుడితోపాటు బాలికను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువకుడిని అదుపులోకి తీసుకొని మైనర్ బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా అత్యాచారానికి పాల్పడినట్లు తేలింది ప్రేమ పేరుతో మైనర్ బాలికను మోసగించే కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన యువకులపై 417,420,363, 376 సెక్షన్లతోపాటు 5, 6 పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు మోకిలా సీఐ నరేష్ కుమార్ తెలిపారు.

You may also like

Leave a Comment