
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని *హాత్ సే హాత్ జోడో యాత్ర*లో భాగంగా రెండవ రోజు గచ్చిబౌలి డివిజన్ లోని గుల్మోర్ పార్క్, నేతాజీ నగర్ యాత్రలో సాగింది. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా కష్టపడి పనిపనియలని పిలుపునిచ్చారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం లో నెలకొన్న సమస్య పరిష్కారం కోసం నిరంతరం పని చేస్తన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఇంటింటికి వెళ్లి నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలను, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పాత్రను తెలియజేసారు. ప్రతీ కాలనీ, డివిజన్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి అభిమానులు ఉన్నారని వారందరిని వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపుకు సహకరించేలా చూడాలని చెప్పారు. పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతీ కార్యకర్తను అధిష్టానం గుర్తిస్తుందని ఆయన తెలిపారు. ఈ యాత్రలో పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పెద్ద సంఖ్యలు పాల్గొన్నారు.