Home » మియాపూర్ లో సర్వాయి పాపన్న భారీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

మియాపూర్ లో సర్వాయి పాపన్న భారీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Admin
11.8kViews
76 Shares

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి  మియాపూర్ ఆల్విన్ చౌరస్తాలో శేరిలింగంపల్లి గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఇంత భారీ ఎత్తున సర్వాయి పాపన్న కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం గర్వించదగ్గ విషయమన్నారు. బహుజనుల అభ్యున్నతి కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి సర్వాయి పాపన్న అని కొనియాడారు. అంత గొప్ప వ్యక్తిని భావితరాలకు పరిచయం చేసేలా శేరిలింగంపల్లి గౌడ సంక్షేమ సంఘం సభ్యులు ప్రతిమను ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి, గీతా కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గౌడ్, కార్పొరేటర్లు పూజిత, జగదీశ్వర్ గౌడ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, రాగం నాగేందర్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు మాజీ ప్రకాష్ గౌడ్, బొబ్బ నవత రెడ్డి, జానకి రామారావు, గౌడ సంఘాల నేతలు పల్లె లక్ష్మణరావు గౌడ్, ఆయిల్లి వెంకన్న గౌడ్, అంబాల నారాయణ గౌడ్, వివిధ పార్టీలు, కుల సంఘాల నాయకులు శేర్లింగంపల్లి గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు దొంతి లక్ష్మీనారాయణ గౌడ్, సంఘం స్టీరింగ్, మెయిన్, యూత్ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

You may also like

Leave a Comment