Home » మాను యూనివర్సిటీలో డ్రగ్స్ నియంత్రణ అవగహన సదస్సు

మాను యూనివర్సిటీలో డ్రగ్స్ నియంత్రణ అవగహన సదస్సు

by Admin
240Views

తెలంగాణ మిర్రర్, గచ్చిబౌలి :  మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో బుధవారం రోజున నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ ల సంయుక్త ఆధ్వర్యంలో డ్రగ్స్ నియంత్రణ పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథులుగా ఐపీఎస్ అర్విందం, డీసీపీ శిల్పవల్లి, అమృత ఫౌండేషన్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ దేవిక రాణి, ఎన్ సీబీ హైదరాబాద్ జోన్ సూపరిండెంట్ సుమిత్ ఆర్య, యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ అనుల్ హసన్ లు హాజరయ్యారు.ఈ సంధర్బంగా డీసీపీ శిల్పావల్లి మాట్లాడుతూ ఆనందం కోసం మత్తు పదార్థాలను వాడి విలువైన జీవితాన్ని, భవిష్యత్, చదువును అంధకారం చేయవద్దని అన్నారు. డ్రగ్స్ ని వాడకుండా ఉండడంతో పాటు డ్రగ్స్ కి అలవాటు పడిన వారికి అవగాహన కల్పించి డ్రగ్స్ కి దూరం చేయాలని, చుట్టూ ఉండే వారికి మత్తు పదార్థలా పై  సరైన అవగాహన కల్పించాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం మత్తు పదార్థాల నియంత్రణ (ఆంటీ డ్రగ్స్) బ్రౌచర్ ని ఆవిష్కరించారు.

You may also like

Leave a Comment