Home » నూతన మినీ తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్ ప్రారంభం

నూతన మినీ తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్ ప్రారంభం

by Admin
200Views

తెలంగాణ మిర్రర్, హైదరాబాద్: రాజేంద్రనగర్ నియోజకవర్గములోని నార్సింగ్ సి హెచ్ సి లో మినీ తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్ ను ఎంపీ రంజిత్ రెడ్డి,ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, చంటి క్రాంతి కిరణ్, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, మునిసిపల్ చైర్మన్, వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లు, వైద్య అధికారులతో కలిసి మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి లు ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..నాడు ప్రభుత్వ ఆస్పత్రులకు పొతే జ్వరం, కోల్డ్ కు ఒక మాత్ర మాత్రమే ఇచ్చి పంపే వారని….నేడు అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేస్తూ, అన్ని రోగాలకు వైద్యం చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికె దక్కుతుందని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలో హబ్ లు అధికంగా ఏర్పాటు చేసినందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ధన్యవాదాలు తెలిపారు. ప్రయివేటు ఆస్పత్రుల లాగా అన్ని రకాల సదుపాయాలతో ఏర్పాటు చేస్తున్న ఈ హబ్ ల గురుంచి కౌన్సిలర్లు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. వైద్య శాఖ తరుపున ప్రత్యేక యాప్ తో ఎక్కడెక్కడ ఈ హబ్ లు ఉన్నాయో తెలుసుకునేల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రేటర్ లో బస్తీ దవాఖానాల లాగా జిల్లాలో కూడా బస్తీ దవాఖానాలు ఏర్పాటుకు కృషి జరుగుతుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు తెలిపారు. ప్రజలకు ఏ ఆరోగ్య సమస్య వచ్చిన ఉస్మానియా,గాంధీ ఆస్పత్రులే ఉండేవని, నేడు గచ్చిబౌలి తో పాటు మరో 3 చోట్ల, 1200 కోట్ల రూపాయల తో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారని ప్రజలందరి తరుపున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మంత్రులు పేర్కొన్నారు.

You may also like

Leave a Comment