Home » మోకిలను మున్సిపాలిటీగా చేయడం తగదు…చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కే ఎస్ రత్నం

మోకిలను మున్సిపాలిటీగా చేయడం తగదు…చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కే ఎస్ రత్నం

by Admin
12.4kViews
76 Shares

తెలంగాణ మిర్రర్, శంకర్ పల్లి : శంకర్ పల్లి మండలంలోని  మోకిల గ్రామాన్ని చుట్టుపక్కల గ్రామాలతో కలిపి మున్సిపాలిటీగా చేస్తామన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కే ఎస్ రత్నం సూచించారు. మోకిల గ్రామాన్ని కేంద్రంగా చేసుకొని కొండకల్, శేరిగూడ, దొంతన్ పల్లి, గోపులారం, ఇరుకుంట తండా, కాకార్లగుట్టా తండా, పొన్నగుట్ట తండా, మహారాజ్పేట్,జన్వాడ మీర్జాగూడ, మియా ఖాన్ గడ్డ, ఇంద్రారెడ్డి నగర్ తదితర గ్రామాలను కలుపుతూ మున్సిపాలిటీ చేస్తానన్న నిర్ణయం వల్ల పేదలపై ఆర్థిక భారం పడుతుందని, పేదలు ఉపాధి కోల్పోయే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మోకిలలో కలుపుతానన్న గ్రామాలన్నీ దూరంగా ఉన్నాయని అవి గ్రామీణ ప్రాంతాల కిందనే పరిగణించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మోకిలను మున్సిపాలిటీ చేసే వాతావరణం కనిపించడం లేదని ఇంకా గ్రామీణ వాతావరణమే కనిపిస్తుందని, ఒక గ్రామానికి ఒక గ్రామానికి మధ్య దూరం కూడా సుదూరంగా ఉందని పేర్కొన్నారు. గ్రామాలలో ఇంకా నిరుపేద రైతులు రైతు కూలీలు జీవనం సాగిస్తున్నారని, మున్సిపాలిటీ చేయడం ద్వారా వారిపై ఆర్థికంగా పెను భారం పడుతుందని పేర్కొన్నారు. మున్సిపాలిటీ అయితే ఇంటి నిర్మాణాలకు ఇంటి పన్నులు పెరిగే అవకాశాలు ఉన్నాయని, ఉపాధి హామీ పథకం కూడా లేకుండా పోతుందని, ప్రజలు ఇబ్బందులలో పడే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మోకిలను మున్సిపాలిటీగా చేయాలన్న ఆలోచనను విరమించుకోవాలని ఆయన సూచించారు. అవసరమైతే మోకిలతో పాటు ఇతర గ్రామాల ప్రజా ప్రతినిధులు, రైతుల అభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదని ఇతవు పలికారు. గ్రామాల ప్రజల తరపున అవసరమైతే మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను కూడా కలుస్తామని సమస్యను వివరిస్తామని తాము గ్రామీణ ప్రాంత ప్రజల పక్షాన ఉండి వారికి మేలు జరిగే కార్యక్రమాలలో తాము పాలు పంచుకుంటామని పేర్కొన్నారు. ప్రభుత్వం కూడా ప్రజల ఆమోదం మేరకే ఏ నిర్ణయమైనా తీసుకుంటుందని అనవసరంగా గ్రామీణ ప్రాంత ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. మోకిలను మున్సిపాలిటీ గా చేయాలనుకుంటే అన్ని గ్రామాల ప్రజా ప్రతినిధులు గ్రామపంచాయతీ పాలకవర్గాల తీర్మానం మేరకే నిర్ణయం తీసుకుంటుందని ఎవరూ కూడా గాలివార్తలకు నమ్మవద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కొండకల్ ఎంపిటిసి బద్దం సురేందర్ రెడ్డి మోకిలా మాజీ ఎంపీటీసీ యాదయ్య, గోపులారం భయానంద్, ప్రతాప్ రెడ్డి, రాజు, శివ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment