Home » శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య

శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య

by Admin
10.9kViews
126 Shares

తెలంగాణ మిర్రర్, శంకర్ పల్లి : శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య. శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బుల్కాపూర్, శంకర్ పల్లి పట్టణంలో దుకాణాల సముదాయం, హైదరాబాద్ రోడ్డు వెంబడి ఏర్పాటుచేసిన వీధి దీపాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..  దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పల్లెలు మున్సిపాలిటీ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం అని ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు.   శంకర్పల్లి గ్రామాన్ని మున్సిపాలిటీగా అభివృద్ధి చేసుకోవడంతోపాటు రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు వెచ్చించి మరింత అభివృద్ధి జరిగే విధంగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామాలలో బిజెపి కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న కుట్రలను ప్రతి కార్యకర్త సరైన రీతిలో బుద్ధి చెప్పాలని సూచించారు. బిఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానన్నారు. దేశ రాజకీయాలలో క్రియాశీల పాత్ర పోషించాలనుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులో అడుగు వేసే విధంగా ఇతర పార్టీ కార్యకర్తలు బిఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శంకర్పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ సాత విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్, వైస్ చైర్మన్ వెంకటరామిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ జ్ఞానేశ్వర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మారేపల్లి పాపారావు, సొసైటీ చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కావలి గోపాల్, శంకర్పల్లి మున్సిపాలిటీ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వాసుదేవ్, ఎంపీటీసీల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షుడు బొల్లారం వెంకటరెడ్డి, కౌన్సిలర్లు శ్వేతా పాండురంగారెడ్డి, పార్శి రాధా బాలకృష్ణ, చంద్రమౌళి, శ్రీనాథ్ గౌడ్, గోపాల్ రెడ్డి, సాత ప్రవీణ్ కుమార్, మహమూద్, పాండురంగారెడ్డి, మహేందర్ రెడ్డి, ఎర్రోళ్ల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment