Home » ఒంటరి మహిళలను చూసి బంగారం దొంగలించిన వ్యక్తి

ఒంటరి మహిళలను చూసి బంగారం దొంగలించిన వ్యక్తి

by Admin
11.0kViews
82 Shares

తెలంగాణ మిర్రర్, శంకరపల్లి : రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం పరిధిలోని పతేపుర్ గ్రామానికి చెందిన బాలమ్మ ఒంటరిగా జీవనం కొనసాగిస్తుంది. షాబాద్ మండలం దోసడ గ్రామానికి చెందిన శంకరయ్య అనే వ్యక్తి పరిచయమై 2 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న వ్యక్తి తన కూతుర్ని ఫతేపూర్ గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చాడు. ఆ సమయంలోనే బాలమ్మతో పరిచయం ఏర్పడి తన కూతురు వద్దకు వచ్చి సోమవారం అర్ధరాత్రి 3 గంటల సమయంలో బాలమ్మ ఇంటికి వచ్చి తెల్లారింది ఆని చెప్పడంతో డోర్ తీయగా తన మీద అత్యాయత్నం చేసి దిండు తో మొహం మీద పెట్టడంతో బాలమ్మ స్పృహ కోల్పోయింది. దానితో అమే చనిపోయింది అనుకొని చెవులకు ఉన్న కమ్మలు కాళ్ళకు ఉన్న కడియాలు, పర్సులో ఉన్న 5000 రూపాయలను తీసుకుని పరార్ అయ్యాడు. అనంతరం ఉదయం 11 గంటలకు బాలమ్మకు మెలకువ వచ్చి ఆరవగా చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఆరా తీసుకొని శంకర్పల్లి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయగా దాంతో కేసు నమోదు చేసుకొని పోలీసులు సి ఐ వినాయక్ రెడ్డి ఎస్సై సంతోష్ రెడ్డి ఎస్సై డిటెక్టివ్ నాగరాజు సిబ్బందితో దొంగని బుధవారం పట్టుకొని తన దగ్గర ఉన్న బంగారాన్ని డబ్బులు రికవరీ చేశారు. ఈ విషయంపై నార్సింగ్ ఎసిపి లక్ష్మీనారాయణ విలేకరుల సమావేశంలో తెలిపారు.

You may also like

Leave a Comment