
తెలంగాణ మిర్రర్, శంకర్ పల్లి : కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం అభ్యర్థి పామేన భీం భరత్ అన్నారు. మండల పరిధిలోని అల్లవాడ జాలేగూడెం గ్రామ నుంచి మాజీ సర్పంచ్ అత్తెల్లి కృష్ణారెడ్డి, యాలాల్ మహేశ్వర్ రెడ్డి, బోనగిరి బాల లింగయ్య ఆధ్వర్యంలో దాదాపు 60 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ అభ్యర్ధి పామేన భీం భరత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అభ్యర్థి భీం భరత్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలపై ప్రజలకు నమ్మకం కలిగి కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు. పార్టీలో చేరిన నాయకులకు కాంగ్రెస్ పార్టీలో తగిన గుర్తింపు ఉంటుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల గ్రామ సర్పంచ్ బండారి శైలజ ఆగిరెడ్డి, PACS చైర్మన్ దేవర వెంకటరెడ్డి, టేకులపల్లి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.