
తెలంగాణ మిర్రర్, శంకర్ పల్లి : శంకర్ పల్లి మండల్ మోకిలా పోలీస్ స్టేషన్ పరిది లో గల ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ మరియు ప్రాచిన్ గ్లోబల్ స్కూల్ కొండకల్ గ్రామము శంకరపల్లి మండలంలో స్కూల్ లలో చైల్డ్ సేఫ్టీ క్లబ్ చైల్డ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాం ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా విద్యార్తుల కు పలు అంశాల పై కీలక అవగాహన సూచనలు చేశారు. ఫిసికల్ సేఫ్టీ మెంటల్ సేఫ్టీ సైబర్ సేఫ్టీ మరియు అంటి డ్రగ్స్ సేఫ్టీ విషయాలపై పోలీస్ వారి ఆద్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించినారు. ముఖ్య అంశాల గురుంచి క్రింద వివరించనైయినది. చిన్న పిల్లల పై జరుగుతున్న అఘాత్యాల గురించి నేరాల గురించి అవగాహన మరియు ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు డయల్ 100 కు ఫోన్ చేసి పోలీస్ సహాయం పొందాలని ఆమె వివరించారు. నేటి హైటెక్ యుగం లో జరుగతున్న సైబర్ క్రైమ్ నేరాలు విదానం గురించి అవగాహన కల్పించారు. సైబర్ క్రైమ్ కు గురైన బాధితులు తక్షణమే, భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1930 నెంబర్ కు కాల్ చేసి ఏ విదంగా ఫిర్యాదు చేయాలో తెలిపారు.
ఆడపిల్లలపై జరిగే నేరాలు,షీ టీం గురించి అదేవిధంగా రోడ్డు ప్రమాదాల పై అవగాహన మరియు మైనర్ పిల్లలకు డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనాలు ఇవ్వడం వల్ల జరిగే పరిణామాల పై సోషల్ మీడియా లో జరుగుతున మోసల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డ్రగ్స్ వాడకం వల్లన జరిగే పరిణామాల పైన అవహగన కల్పించారు. విద్యార్దులకు వచ్చే సమస్యల పైన ప్రతి స్కూల్ లో ఒక్క చైల్డ్ సేఫ్టీ క్లబ్ ను ఏర్పాటు చేయడం జరిగినది, క్లబ్ లో మెంబర్స్ గా ఇద్దరు టీచర్స్, ఇద్దరు స్టూడెంట్స్, ఇద్దరు తల్లిదండ్రులు మరియు ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు కలరు. పైన తెలిపిన విషయాలలో ఏవైనా సమస్యలు వచ్చిన విద్యార్దులు వారి సమస్యలును ఒక్క లెటర్ వ్రాసి, లెటర్ ను స్కూల్ లో ఏర్పాటు చేసిన కంప్లయింట్ బాక్స్ నందు వేసిన పిర్యాదు సభ్యులు ఆద్వర్యంలో పిర్యాదు యొక్క సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది అని రష్మి పెరుమాళ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మోకీల పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ పి. నరేష్, సబ్ ఇన్స్పెక్టర్స్, కోటేశ్వర్ రావు, కె. కృష్ణ, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.