Home » టీఆర్ఎస్ పార్టీ జ‌న‌ర‌ల్ బాడీ స‌మావేశం ఏర్పాట్ల‌ను పరిశీలించిన మంత్రి కెటిఆర్

టీఆర్ఎస్ పార్టీ జ‌న‌ర‌ల్ బాడీ స‌మావేశం ఏర్పాట్ల‌ను పరిశీలించిన మంత్రి కెటిఆర్

by Admin
340Views

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి:   ఈ నెల 25న హైటెక్స్‌లో జ‌ర‌గ‌నున్న‌ టీఆర్ఎస్ పార్టీ జ‌న‌ర‌ల్ బాడీ స‌మావేశం ఏర్పాట్ల‌ను పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం మ‌ధ్యాహ్నం ప‌రిశీలించారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ , చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి , ఎమ్మెల్సీలు నవీన్ రావు ,కర్నెప్రభాకర్ , టీసీసీ ఛైర్మెన్ , గ్యాదరి బాలమల్లు, పౌర సరఫరాల ఛైర్మెన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి , ప్రభుత్వ విప్ గాంధీ, ఎమ్మెల్యే లు మాగంటి గోపీనాథ్, కృష్ణ రావు , మాజీ మేయర్ బొంతు రాం మోహన్ , కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్ ,నార్నె శ్రీనివాసరావు మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర , మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు,ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్, జోనల్ కమిషనర్ రవి కిరణ్ , డీసీ సుధాంష్ గారు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంత‌రం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ అనేక సవాళ్లను ఎదుర్కొని తెలంగాణ సాధించుకున్నాము అని తెలిపారు. తెలంగాణ ప్ర‌జ‌ల ఆశీర్వాదంతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశామ‌న్నారు. త‌మ పార్టీ విధానాల‌ను, ప‌రిపాల‌న‌ను మెచ్చి ప్ర‌జ‌లు మ‌రోసారి ఆశీర్వ‌దించారు అని పేర్కొన్నారు.25న జ‌రిగే పార్టీ జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్‌లో పార్టీ అధ్య‌క్షుడి ఎన్నిక ఉంటుందని తెలిపారు. తెలంగాణ ప్ర‌భుత్వ ప‌రిపాల‌న గొప్ప‌గా సాగుతుంద‌ని, అపూర్వ‌మైన విధానాల‌తో, పాల‌సీల‌తో దేశంతో పాటు ఇత‌ర రాష్ట్రాల‌కు ఆద‌ర్శంగా నిలిచామ‌న్నారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి వచ్చే పార్టీ ప్రతినిధులతో పాటు.. మొత్తం సమావేశం సజావుగా సాగేలా అనేక ఏర్పాట్లను చేస్తున్నామ‌ని కేటీఆర్ తెలిపారు. సభ నిర్వహణ, దానికి సంబంధించిన ఏర్పాట్లను, కార్యక్రమాలను సమన్వయం చేసుకునేందుకు పార్టీ తరపున పలు కమిటీలను కేటీఆర్ ప్ర‌క‌టించారు.

ఆహ్వాన కమిటీ:

1. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ,

2. ఎంపీ రంజిత్ రెడ్డి

3. ఎమ్మెల్యే గాంధీ

4. హైదరాబాద్ మేయర్ విజయ లక్ష్మి

సభా వేదిక ప్రాంగణం అలంకరణ:

1.ఎమ్మెల్యే గోపీనాథ్

2.ఎమ్మెల్సీ నవీన్ కుమార్

3.బాలమల్లు , చైర్మన్

4.మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, చైర్మన్

ప్రతినిధుల నమోదు, వాలంటరీ:

1.ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

పార్కింగ్:

1.ఎమ్మెల్యే కేపి వివేక్

ప్రతినిధుల భోజనం:

1.ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

తిర్మనాల కమిటీ:

1. మధుసుదన చారి

2.పర్యదా కృష్ణామూర్తి

మీడియా:

1.ఎమ్మెల్సి భాను ప్రసాద్

2. కర్నే ప్రభాకర్

గ్రేటర్ హైదరాబాద్ అలంకరణ :

గ్రేటర్ హైదరాబాద్ మంత్రులు, ఎమ్మెల్యేలు

ఆహ్వాన కమిటీ, సభా వేదిక ప్రాంగణం, నగర అలంకరణ, ప్రతినిధుల నమోదు వాలంటీర్ల కమిటీ, పార్కింగ్, భోజన కమిటీ, తీర్మానాల కమిటీ, మీడియా కమిటీల‌తో పాటు ఇత‌ర క‌మిటీల‌ను కేటీఆర్ వెల్ల‌డించారు. ఈ సమావేశానికి వచ్చే ప్రతినిధులకు పార్టీ తరఫున గుర్తింపు కార్డులను అందిస్తామ‌న్నారు. పార్టీ ఆహ్వానించిన వారు మాత్రమే ఈ సమావేశానికి హాజరు కావాల్సి ఉంటుంది అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

You may also like

Leave a Comment