
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, బడుగు బలహీన వర్గాల అభివృధ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు.బుధవారం శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదర్ నగర్ డివిజన్ కు చెందిన పలు పార్టీ నేతలు జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.ఆరు గ్యారెంటీ పథకాలు మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు 2,500లు, రైతు భరోసా ద్వారా ఎకరానికి 15 వేలు, వ్యవసాయ కూలీలకు 12 వేలు, గృహజ్యోతి పథకంతో ప్రతి మహిళ కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత కరెంట్, ఇందిరమ్మ పథకం ద్వారా ఇల్లు లేనివారికి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షలు, యువ వికాసం కింద 5 లక్షల విద్య భరోసా కార్డు అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న ఆరు గ్యారెంటీ పథకాల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని అన్నారు.వెంకటేష్ యాదవ్,రాజీ రెడ్డి,యాదగిరి గౌడ్,అర్జున్,విష్ణు,రాములు,శ్రీను,రామ్ బాబు,అబ్దుల్, సుందర్ రాజు, సి.హెచ్.వెంకయ్య, మాణిక్యం,బాలకృష్ణ, సూర్యనారాయణ, కిరణ్,ఎం.డి.జలీల్ లు కాంగ్రెస్ పార్టీలో చేరారు.