
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని అదేవిధంగా అరెకపూడి గాంధీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ఎమ్మెల్యే గాంధీ సతీమణి శ్యామలాదేవి అన్నారు. శనివారం చందానగర్ డివిజన్ పరిధిలోని అన్నపూర్ణ ఎనక్లేవ్, విద్యానగర్, ఫ్రెండ్స్ కాలనీ, శ్రీ లక్ష్మీ శుభం ఆర్కేడ్ అపార్ట్మెంట్స్, సాయి కీర్తి అపార్ట్మెంట్స్ , SVS అవాస అపార్ట్మెంట్స్, డాల్ఫిన్ దుర్గ కౌంటీ కాలనీలలో కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆమె ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సబ్బండ వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగా మ్యానిఫెస్టో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో గుడ్ల ధనలక్ష్మి, వరలక్ష్మి, చంద్రిక ప్రసాద్, మాధవి, పృథ్వి, రాధిక, ప్రణీత,భవాని, కుమార్, సునీత,మీనా ,హరిత, పార్వతి రాజేశ్వరి, యుగంధర్, రజిని, శ్యామల, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.