
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : చంద్రబాబునాయుడు అరెస్టును ఖండిస్తూ, ఆయనకు మద్దతుగా మియాపూర్ నుండి నిర్వహించిన Lets Metro కార్యక్రమంలో బిజెపి శేరిలింగంపల్లి నాయకులు గజ్జల యోగానంద్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా గజ్జల యోగానంద్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అరెస్టు బాధాకరం అని, కేవలం రాజకీయ కుట్రలో భాగంగా కక్ష పూరితంగా చంద్రబాబుని అరెస్టు చేశారని అయన తెలిపారు.హైదరాబాదు నగర కీలక అభివృధిలో చంద్రబాబు నాయుడు క్రియాశీలక పాత్ర పోషించారని, విజన్ 2020 లో భాగంగా ఎంతో అభివృధి చేసారని, చంద్రబాబు గారు చేసిన అభివృద్ధిని బిఆర్ఎస్ పార్టీ తామే చేశామని ప్రగర్భాలు పలకడం సరికాదని, సుపరిపాలను రాజకీయాలకు అతీతంగా అభినందించాలని తెలిపారు. ఈ మెట్రో రైలులో చంద్రబాబు నాయుడుకి సంఘీభావం తెలపడం వ్యక్తిగతమని ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా కేవలం నగర అభివృద్ధిలో ఎవరి పాత్ర ఎంత ఉందని తెలియజేయడమే తన ఉద్దేశమని యోగానంద్ తెలిపారు.చంద్రబాబుకు న్యాయస్థానాల్లో తప్పకుండా న్యాయం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తనకు న్యాయ వ్యవస్థపై పూర్తిగా నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు అభిమానులు, బీజేపీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, ప్రజలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.