Home » బొటానికల్ గార్డెన్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రన్ ఫర్ పీస్

బొటానికల్ గార్డెన్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రన్ ఫర్ పీస్

by Admin
10.2kViews
145 Shares

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి :    జాతిపిత మహాత్మాగాంధీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రభుత్వ విప్,శేరిలింగంపల్లి శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు.సోమవారం జాతిపిత మహాత్మాగాంధీ జన్మదినం సందర్బంగా శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని బొటానికల్ గార్డెన్స్ లో  బొటానికల్ గార్డెన్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ ఫర్ పీస్ (10K , 5K, 2k ) కార్యక్రమంలో ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు,అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మెన్ వంటేరు ప్రతాప్ రెడ్డి,విప్ అరెకపూడి గాంధీ,కార్పొరేటర్లు పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు.ముందుగా వారు   గాంధీజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఘనంగా  నివాళులర్పించారు..మాట్లాడుతూ.. మహాత్మా గాంధీజీ జయంతి రోజున రన్ ఫర్ పీస్‌ను నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. దేశానికి గాంధీజీ చేసిన సేవలను గుర్తు చేసుకోవడం, యువతకు ఆయన ఆదర్శనీయ జీవితం తెలియజెప్పడంతో పాటు ఫిట్ నెస్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని  పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులలో ప్రతి ఒక్కరూ శారీరకంగా, ఆరోగ్యంగా ఉండడానికి తప్పనిసరిగా వాకింగ్, వీలైతే కొద్దిదూరం పరుగెత్తడం దినచర్యలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నిర్వాహకులను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు.రన్ ఫర్ పీస్‌లో పెద్ద ఎత్తున పాల్గొని, విజయవంతం చేసినందుకు నగర ప్రజలకు బొటానికల్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు..ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్,జగదీశ్వర్ గౌడ్, డీసీపీ  సందీప్,ఏసీపీ శ్రీనివాసరావు,సిఐ  జేమ్స్ బాబు,మాజీ కార్పొరేటర్ రవీందర్ ముదిరాజు,  బొటానికల్ గార్డెన్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్  ప్రతినిధులు భరత్ రెడ్డి , బాలకృష్ణ , ఏవీ రెడ్డి అసోసియేషన్ సభ్యులు మరియు  బీఆర్ఎస్ పార్టీ  నాయకులు చాంద్ పాషా, తిరుపతి రెడ్డి, జంగం గౌడ్ , రమేష్ పటేల్ ,బలరాం యాదవ్ ,  నరేష్,గణపతి ,అశోక్ సాగర్,తిరుపతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment