Home » నేర రహిత సమాజం కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి…

నేర రహిత సమాజం కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి…

by Admin
480Views

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : నేర రహిత సమాజం కోసం ప్రతి కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వ విప్ గాంధీ, డీసీపీ శిల్పవల్లి,మియాపూర్ ఏసిపి కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ ‘ఏ’ బ్లాక్  కాలనీ లో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో రూ. 4  లక్షల.70  వేల అంచనా వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన  34 సీసీ కెమెరాలను ప్రభుత్వ విప్ గాంధీ ముఖ్య అతిధిగా పాల్గొని మంగళవారం కార్పొరేటర్  మాదహపూర్ జోన్ డీసీపీ శిల్పవల్లి, మియాపూర్ ఏసీపీ శ్రీ కృష్ణ ప్రసాద్,సిఐ  తిరుపతిరావు లతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సీసీ కెమెరాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రేమ్ నగర్ A బ్లాక్  కాలనీ వాసులు,విజేత సూపర్ మార్కెట్ అధినేత జగన్మోహన్ రావు, కరీంమెడికల్ యజమాని,ప్రేమ్ నగర్ వ్యాపారస్తులు ముందుకు రావడం అభినందనీయమని వారి సహకారం తో  సీసీ కెమెరా ల ఏర్పాటు కు చొరవ తీసుకోవడం గొప్ప విషయమని అన్నారు.నేరాలను అదుపు చేయడంతో పాటు దొంగతనాలను నివారించవచ్చన్నారు. అలాగే వాహనాల రాకపోకలను గుర్తించవచ్చన్నారు. అరాచకాలను అరికట్టడంలో సీసీ కెమెరాలు ముఖ్య పాత్ర పోషిస్తాయన్నారు. సీసీ కెమెరాల్లోని వీడియో ఫుటేజీలతో ముఖ్యమైన కేసులను ఛేదించవచ్చన్నారు.  పట్టణాలు, కాలనీల్లో సీసీ కెమెరాల ఏర్పాటు పెరిగిందన్నారు. చాలా మంది ఇండ్లలో సొంత ఖర్చుతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటున్నారని చెప్పారు.ఈ కార్యక్రమంలో మియాపూర్ ఎస్ఐ రవి కిరణ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్,  తెరాస నాయకులు జంగం గౌడ్, శ్రీనివాస్ చౌదరీ ,రమేష్ పటేల్, తిరుపతి ,రజినీకాంత్, మహేందర్,సాజిద్, ఇమామ్, రమేష్,రూప రెడ్డి , శారదా తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment