Home » ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిచడమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే జి.ఎం.ఆర్

ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిచడమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే జి.ఎం.ఆర్

by Admin
420Views

*పటాన్‌చెరు, రామచంద్రాపురం లలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు 

తెలంగాణ మిర్రర్,పటాన్‌చెరు : డా.బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రతిఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.బుధవారం 73 వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని పటాన్‌చెరు,రామచంద్రాపురం డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ ల కార్పొరేటర్లు, వార్డు సభ్యులు,తెరాస నాయకులు,కార్యకర్తలు తదితరులు  పాల్గొన్నారు.

You may also like

Leave a Comment