
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నామని ఎంపీ డా. రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. మంగళవారం మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ ప్రభుత్వ పాఠశాలలో రూ.1 కోటి 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించబోయే 9 అదనపు తరగతుల గదుల నిర్మాణ పనులకు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డా.గడ్డం రంజిత్ రెడ్డి, ప్రభుత్వ గాంధీ,కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ విద్యారంగానికి ఎంతో కృషి చేస్తున్నారని,కేజీ నుండి పీజీ వరకు ప్రవేశపెట్టడం, గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేయడం,రాష్ట్రంలో విద్యారంగంలో సమూల సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు.మన ఊరు.. మన బడి కార్యక్రమం ద్వారా రూ.7,300 కోట్లతో సర్కారు స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి శ్రీకారం చుట్టారని,ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశ పెట్టారని అన్నారు.ప్రయివేట్ పాఠశాలలో ఫీజుల నియంత్రకు ప్రత్యేక చట్టం తెచ్చారని తెలిపారు.శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తామని ,మెరుగైన మౌలిక వసతులు కలిపిస్తామని,పిల్లలకు చదువుకోవడానికి వీలుగా అనువైన చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేస్తామని శాసన సభ్యులు గాంధీ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు వసుంధర,తెరాస నాయకులు బి.ఏస్.ఎన్. కిరణ్ యాదవ్,గంగాధర్ రావు,మోహన్ ముదిరాజ్, ప్రతాప్ రెడ్డి, మాధవరం గోపాల్ రావు, మహేందర్ ముదిరాజ్,గోపారాజు శ్రీనివాస్ రావు,మహమ్మద్ ఖాజా ,జంగిర్,సుప్రజా,స్వరూప,హన్మంతరావు, రాజు గౌడ్,రవి గౌడ్,శివ ముదిరాజ్,శ్రీను,వెంకటేష్,జంగం మల్లేష్,శ్రీధర్ ముదిరాజ్, దయానంద్ ముదిరాజ్,రాజేష్ గౌడ్,రాజు ముదిరాజ్, వజీర్,రాజు,విజయ్ ముదిరాజ్, రాజు తదితరులు పాల్గొన్నారు.