
870Views
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : 15 -18 వయసు గల యువత తప్పకుండా కొవాగ్సిన్ వ్యాక్సిన్ వేయించుకోవాలని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. సోమవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని నిర్వహించిన వాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరోన మహమ్మారి ని ఎదుర్కోవడానికి దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు.ప్రతి తల్లి దండ్రులు తమ పిల్లల ఉజ్వల భవిషత్తును కోసం 15 నుండి 18 వయసు గల యువతకు తప్పనిసరిగా టీకా వేయించాలని కార్పొరేటర్ రాగం సూచించారు. ఈ కార్యక్రమంలో గౌరవ డివిజన్ అధ్యక్షులు వీరేశం గౌడ్, కొండలరెడ్డి, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్ర డాక్టర్. రామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.