Home » 15 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు వాక్సిన్ తీసుకోవాలి : కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి

15 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు వాక్సిన్ తీసుకోవాలి : కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి

by Admin
880Views

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి  : చందానగర్ డివిజన్ పరిధిలోని మధీనాగుడా నారాయణ జునియర్ కళాశాల,నారాయణ హైస్కూల్ లలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చందానగర్ డివిజన్ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డీ పాల్గొన్ని వాక్సినేషన్ పక్రియను పరిశీలించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి  మాట్లాడుతూ రోజురోజుకూ కరోనా కేసులు పేరుగుతున్నాయని.కరోనా భారీన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒమిక్రాన్‌ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు వాక్సినేషన్ ఒక్కటే మార్గం అన్నారు…15-18 వయస్సు గల పిల్లలకు తల్లిదండ్రులు వాక్సినేషన్ తప్పకుండా వేయించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి,కళాశాల ప్రిన్సిపాల్ అచ్యుత్ బాబు , స్కూల్ ప్రిన్సిపాల్ రాధిక, ఏ ఓ నగేష్,సురేష్ , శ్రీకాంత్,లత,సుబాష్,అమిత్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment