
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్, ఆదిత్య నగర్, హెచ్ఎంటి హిల్స్, భాగ్యనగర్ ఫేస్ -2, రాంనరేష్ నగర్, హైదర్ నగర్, అల్లపూర్ సొసైటీ కాలనీ లలో రూ. 4 కోట్ల 9 లక్షల 40 వేల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే యుజిడి పైప్ లైన్ పునరుద్ధరణ నిర్మాణ పనులకు జిహెచ్ఎంసి అధికారులు , కార్పొరేటర్లు నార్నె శ్రీనివాస రావు, ఉప్పలపాటి శ్రీకాంత్ ,మాజీ కార్పొరేటర్ శ్రీ రంగరావు తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ.. ఒకవైపు కరోనా మహమ్మారి వంటి విపత్కర పరిస్థితుల్లో అభివుద్ది ఆగకూడదనే ఉద్దేశ్యం తో సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకం లో మంత్రి కెటిఆర్ సహకారం తో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదితానని గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా హైదర్ నగర్ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ శనివారం శంకుస్థాపన చేసుకోవడం చాల సంతోషకరం అని అదేవిధంగా వర్షకాలం ను యుజిడి పునరుద్దరణ పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని, ప్రజలకు ట్రాఫిక్ రహిత, సుఖవంతమైన, మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని, ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని ప్రభుత్వ విప్ గాంధి అన్నారు. పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గాంధీ అధికారులను ఆదేశించారు.

అభివృద్ధి కార్యక్రమాకు శంకుస్థాపన
శంకుస్థాపన చేసిన కార్యక్రమాల వివరాలు :
1. శ్రీరామ్ నగర్ కాలనీ లో రూ.23.00 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే యుజిడి పునరుద్ధరణ నిర్మాణ పనులు.
2. హెచ్ఎంటి హిల్స్ కాలనీ లో రూ.35.50 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే యుజిడి పునరుద్ధరణ నిర్మాణ పనులు.
3. ఆదిత్య నగర్ కాలనీ లో రూ.159.90 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే యుజిడి పునరుద్ధరణ నిర్మాణ పనులు.
4. భాగ్యనగర్ ఫేస్ -1 కాలనీ లో రూ.25.00 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే యుజిడి పునరుద్ధరణ నిర్మాణ పనులు.
5. రాంనరేష్ నగర్ కాలనీ లో రూ.78.00 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే యుజిడి పునరుద్ధరణ నిర్మాణ పనులు.
6. హైదర్ నగర్ లో రూ.18.00 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే యుజిడి పునరుద్ధరణ నిర్మాణ పనులు.
7. అల్లపూర్ సొసైటీ కాలనీ లో రూ.70.00 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే యుజిడి పునరుద్ధరణ నిర్మాణ పనులు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు AE రాజీవ్, వర్క్ ఇన్స్పెక్టర్ మహాదేవ్, తెరాస నాయకులు దామోదర్ రెడ్డి, పోతుల రాజేందర్, కృష్ణ ముదిరాజు, వెంకటేష్ యాదవ్, సత్యనారాయణ, గోపి చంద్, సదా బాలయ్య, అష్రాఫ్, రాజు సాగర్, సద్దాం, రామకోటేశ్వర్ రావు,చౌదరీ, ఉమామహేశ్వరరావు, వెంకట్ రెడ్డి , సదాశివుడు, శివ రెడ్డి , అప్పి రెడ్డి, అనిల్, కృష్ణ, సత్తార్, పప్పు, కృష్ణ కుమారి, విమల, లత, సదా మాధవి, పర్వీన్ సుల్తానా, జుబేదా బేగం, బీజన్ బీ, హామీద్ ఉసేన్, కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.