Home » హైదరాబాద్ వేదిక గా రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) ప్రారంభం

హైదరాబాద్ వేదిక గా రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) ప్రారంభం

by Admin
10.3kViews
64 Shares

తెలంగాణ మిర్రర్, హైదరాబాద్ : రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) బెంగుళూరు వేదిక గా ఘనంగా ముగిశాయి. తొమ్మిది రోజులపాటు జరిగిన మ్యాచ్ లు అభిమానులను ఎంతగానో అలరించాయని లీగ్ నిర్వాహకులు తెలిపారు. వాలీబాల్ ప్రేమికులకు ఉత్కంఠతో పాటు ఉల్లాసాన్ని నింపేందుకు ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) సెకండ్ సీజన్ బుధవారం నుంచి హైదరాబాద్ వేదికగా ప్రారంభం కానున్నాయి. రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ కు సంబంధించిన వివరాలను హైటెక్సిటీలోని లెమెన్ ట్రీ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో లీగ్ సీఈఓ జాయ్ భట్టాచార్య వెల్లడించారు. లీగ్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుందని, గత సీజన్తో పోల్చితే ఈ సీజన్ కు మరింత ఆధరణ పెరిగిందన్నారు. బెంగుళూరులో ప్రారంభమైన లీగ్ పోటీలు హైదరాబాద్ లోని గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో కొనసాగనున్నట్లు తెలిపారు. లీగ్ ద్వారా యువ క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని, ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో పీవీఎల్ అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు చేకూరడం ఖాయమని, లీగ్ మరింత వృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం హైదరాబాద్ బ్లాక్ హాక్స్ జట్టు ప్రిన్సిపల్ యజమాని అభిషేక్ రెడ్డి మాట్లాడుతూ గత సీజన్తో పోల్చితే హైదరాబాద్ జట్టు మెరుగ్గా రాణిస్తుందని, లీగ్ ఉత్తమ ప్రతిభ నగరవాసులకు ప్రత్యేక ఆహ్లాదాన్ని అందిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జట్టు కెప్టెన్ గురు ప్రశాంత్తో పాటు మిగతా జట్ల కెప్టెన్లు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment