
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : మాదాపూర్,మేజర్ న్యూస్ : మాదాపూర్‌లోని హైటెక్ సిటీ సమీపంలోని ఐటీ పార్క్ రహేజా మైండ్ స్పేస్ లో రెండు భవనాలను కూల్చివేశారు అధికారులు. ఒక్కో బిల్డింగ్ ఆరు అంతస్తుల్లో ఉన్నాయి. ఈ రెండు భవనాల విషయంలో యజమానుల సమస్యలతోపాటు.. సాంకేతిక పరమైన సమస్యలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ రెండు భవంతులను కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో ఆ ప్రాంతంలో దుమ్ము దూళి అలమకుంది.రహేజా మైండ్ స్పేస్‌లోని 7, 8 బ్లాక్‌లలో నాలుగంతస్తుల భవనాలు రెండు వేర్వేరుగా ఉన్నాయి. ఈ భవనాల స్థానంలో కొత్త భవనాలు నిర్మించేందుకు రెండింటినీ కూల్చివేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి రెండు భవనాలను క్షణాల్లో కూల్చి వేశారు. పక్కనే భారీ బహుళ అంతస్తుల భవనాలు ఉన్నాయి. వాటికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా పాత భవనాలను భవనాల కూల్చివేతను ఎడిపిక్ ఇంజినీరింగ్ సంస్థ పర్యవేక్షించింది. 10 సెకన్లలోనే మైండ్ స్పేస్ లోని రెండు భవనాలను నేలమట్టం చేశారు.