Home » హుడా పార్కు స్థలాన్ని పరిశీలించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

హుడా పార్కు స్థలాన్ని పరిశీలించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

by Admin
1.2kViews

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ లోని అన్ని పార్కులను అభివృద్ధి చేస్తున్నామని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తెలిపారు. డివిజన్ పరిదిలోని హుడా ట్రేడ్ సెంటర్ లో ఉన్న పార్క్ స్థలాన్ని ఆయన అధికారులు, అసోసియేషన్ సభ్యులతో కలిసి గురువారం పరిశీలించారు. పార్కులో నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించి పార్కు అభివృద్ధి కోసం గ్రీనరీ తో పాటు పార్క్ చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ త్వరితగతిన పార్కు అభివృద్ధికి నిధులు మంజూరు చేసి కాలనీ వాసులకు అందుబాటులో కి తెస్తామని కార్పొరేటర్ స్థానిక కాలనీ వాసులకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అధికారులు ఏఈ సునీల్, వర్క్ఇన్స్పెక్టర్ మహేష్,రాజు జీ.జనార్ధన్ రెడ్డి,శ్రీనివాస్ గౌడ్,శ్రీనివాస్, కాలనీ వాసులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment