
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : కాంగ్రెస్ పార్టీ ద్వారానే ప్రజలకు సుపరిపాలన అందుతుందని హఫీజ్ పెట్ డివిజన్ కార్పొరేటర్,కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ సతీమణి పూజిత గౌడ్ అన్నారు.గురువారం డివిజన్ పరిధిలోని మదీనాగూడలో కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జగదీశ్వర్ గౌడ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని శేరిలింగంపల్లిని మరింత అభివృద్ధి చేస్తారని అన్నారు.జగదీశ్వర్ గౌడ్ కూతురు వి.హారిక తండ్రికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. గురువారం హఫీస్ పెట్ డివిజన్ పరిధిలోని దత్తసాయి నగర్,గంగారాంలో ఆమె ఇంటింటా ప్రచారం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను పంపిణి చేస్తూ ఓటర్లకు వివరించారు. తన తండ్రి వి.జగదీశ్వర్ గౌడ్ గెలిపిస్తే శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆమె వెంట కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.