
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలు డివిజన్ లల్లో 77వ స్వాతంత్య్రం దినోత్సవం వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.కొండాపూర్, గచ్చిబౌలి,మాదాపూర్,హాఫిజ్ పేట, మియాపూర్, శేరిలింగంపల్లి డివిజన్ లలో ప్రధాన చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన జాతీయ జెండాలను ఎగురవేశారు శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మారబోయిన రఘునాథ్ యాదవ్.దేశానికి స్వాతంత్య్రం తీసుకు వచ్చిన మహనీయుల అడుగుజాడల్లో నడుద్దామని అయన పిలుపు నిచ్చారు. పంద్రాగస్టును పురస్కరించుకొని మంగళవారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు.అనంతరం ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సభలో అయన మాట్లాడుతూ… అనేకమంది మహనీయుల త్యాగం ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని, ఆ మహనీయులు అడుగుజాడల్లో నడుద్దామని అన్నారు.విదేశీపాలనలో నలిగిన భారతీయులకు కొన్నేళ్ల ఉద్యమాలు, అమరుల త్యాగ ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు.ఎందరో మహనీయుల త్యాగఫలం మన స్వాతంత్య్ర భారతమన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల ఆశయ సాధనకు, అద్భుతమైన దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్నానని తెలిపారు. అసమానతలు తొలగించి, పేదరికం రూపుమాపి తిరుగులేని శక్తిగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు స్పష్టమైన విజన్‌తో కాంగ్రెస్ ప్రయాణం చేసేందుకు రూపకల్ప చేసిందన్నారు. తద్వారా 2047 నాటికి భారత్ ప్రపంచ శక్తిగా ఆవిర్భవిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో రాములు గౌడ్ అమీ వెంకటేశ్వర్ రెడ్డి ఆజాం సాయిలు జీవన్ గాల్ రెడ్డి డాక్టర్ రాజబాబు లక్ష్మీబాయి సాంబయ్య సుందర్ నరేష్ బాబ బాయ్, ఆఫ్రోజ్ రాజలింగం సిద్దు సతీష్ తదితరులు జాతీయ జెండాలను పట్టుకుని భారత్ మాత కీ జై అంటూ నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు