
తెలంగాణ మిర్రర్,పటాన్‌చెరు : రామచంద్రపురంలోని స్మశాన వాటికలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎమ్ఐజిఫేస్ 1తెలంగాణ పెన్షనర్స్,రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ సభ్యులు శుక్రవారం రామచంద్రాపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నగేష్ ను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారుఈ సందర్బంగా వారు మాట్లాడుతూ స్మశాన వాటికలో విద్యుత్,మంచి నీటి సదుపాయాలు కల్పించి ,స్నాన గదులను ఏర్పాటు చేయాలనీ, అదేవిధంగా స్మశాన వాటికలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి పచ్చదనం కోసం మొక్కలు నాటలని కోరారు. శవ దహనానికి అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని దీనిని కట్టడి చేసి ఒకే ధర ఉండేలా సూచిక బోర్డు ఏర్పాటు చేయాలనీ అంతేకాకుండా స్మశాన వాటికలో అసాంఘిక ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ ను అసోసియేషన్ సభ్యులు కోరారు.దీంతో సానుకూలంగా స్పందించిన కార్పొరేటర్ పుష్పనగేష్ మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం స్మశాన వాటికలు అభివృద్ధిలో భాగంగా నిధులు మంజూరు చేసిందని, రామచంద్రపురం స్మశాన వాటికను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, పచ్చధనం కోసం విరివిగా మొక్కలు నాటుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు