
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : గత వారం రోజుల నుంచి లింగంపల్లి డివిజన్ సురభి కాలనీవాసులు వట్టినాగులపల్లి లోని ఎం స్పోర్ట్స్ స్టేడియంలో నిర్వహిస్తున్న స్పెషల్ ప్రీమియం లీగ్ క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా ఫైనల్ మ్యాచ్ లో తలపడిన ఫైటర్స్ కింగ్స్ మరియు రిలేషన్ ఫైటర్స్ రెండు జట్లు ఫైనల్లో మొదటి , రెండవ స్థానాలలో గెలుపొందగా గెలిచిన క్రీడాకారులకు బిజెపి పార్టీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారి చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరిగింది..
ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ వారు మాట్లాడుతూ కాలనీవాసులు ఒక మంచి క్రీడనెంచుకొని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆడడం అనేది ఒక మంచి పరిణామం అని తెలియజేస్తూ, ఈ టోర్నమెంట్ నిర్వహణకు సహాయ సహకారాలు అందించిన వారిని అభినందిస్తూ దీనిని నిర్వహించిన నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు , అంతేకాకుండా క్రీడాకారులకు ఎల్లప్పుడు మా సహాయ సహకారాలు అందిస్తామని వచ్చే నెలలో మా ట్రస్ట్ తరఫున కూడా క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహిస్తామని క్రీడాకారులకు తీపి కబురు అందించారు, ఈ కార్యక్రమంలో ఇరు జట్ల క్రీడాకారులు, మారబోయిన అనిల్ కుమార్ యాదవ్, ఆదిత్య కుమార్, శ్రీకాంత్, మొదలగువారు పాల్గొన్నారు.