Home » సైబరాబాద్ లో ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం -నిమజ్జన సరళిని పరిశీలించిన సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర

సైబరాబాద్ లో ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం -నిమజ్జన సరళిని పరిశీలించిన సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర

by Admin
9.4kViews
120 Shares

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. సోమవారం రాజేంద్రనగర్ జోన్ లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పత్తికుంట చెరువును రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, ఎస్ఓటి డిసీపీ రషీద్, రాజేంద్రనగర్ ఏడీసీపీ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్., తదితరులతో కలిసి సందర్శించారు.ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ మాట్లాడుతూ… సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో జరిగే గణపతి ఉత్సవాలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ పరంగా వివిధ శాఖల అధికారులంతా సమన్వయంతో పని చేస్తున్నారన్నారు. ఈ నెల 18వ తేదీన మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయన్నారు. ఈ ఏడాది కమీషనరేట్ పరిధిలో 12000 పైగా వినాయకులను ప్రతిష్టించారన్నారు. పత్తి కుంట చెరువు వద్ద 2 భారీ క్రేన్ లను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివరకూ పత్తి కుంట చెరువులో 1700 కు పైచిలుకు వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారన్నారు. అవసరం మేరకు చివరి రోజు వరకూ ఇంకొక క్రేన్ ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. వినాయక నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు సజావుగా సాగేందుకు కమీషనరేట్ పరిధిలో 24 X 7 పని చేస్తూ భద్రతాపరంగా పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉన్నామన్నారు.ప్రజలు శాంతియుతంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను జరుపుకునేందుకు ముందస్తు ప్రణాళికతో పోలీస్ శాఖతో పాటు అన్ని శాఖల అధికారులతో కలిసి పనిచేస్తున్నామన్నారు. గణేశ్‌ నిమజ్జనోత్సవాలను ప్రశాంత వాతావరణంలో, నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు ప్రతిష్ఠించిన గణేశ్‌ విగ్రహాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించామన్నారు.నిమజ్జనం దృష్ట్యా ట్రాఫిక్‌ మళ్లింపుపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. డయల్ 100 కు వచ్చే కాల్స్ పై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. విజిబుల్ పోలిసింగ్ తో పాటు సీసీటీవీలపై దృష్టి సారించాము. ప్రజలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అధికారులంతా సమన్వయంతో పని చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, ఎస్ఓటి డిసీపీ రషీద్, రాజేంద్రనగర్ ఏడీసీపీ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్., మాదాపూర్ ఎస్ఓటి ఏడీసీపీ నారాయణ, ఏడీసీపీ క్రైన్స్ శ్రీ నరసింహారెడ్డి, రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఏడీసీపీ శ్రీనివాసరెడ్డి, ఎస్బీ ఏడీసీపీ రవి కుమార్, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఏసీపీ మురళీకృష్ణ, రాజేంద్రనగర్ ఇన్ స్పెక్టర్ నాగేంద్రబాబు, రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ బోస్ కిరణ్, సిసిఎస్ ఇన్ స్పెక్టర్ రాజేంద్రనగర్ నరసింహ, భాగ్యనగర్ ఉత్సవ సమితి సభ్యులు ఇతర శాఖల అధికారులు తదితర పాల్గొన్నారు.

Leave a Comment