
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో బుధవారం 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ముందుగా సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. సిబ్బంది, ప్రజలందరికీ ముందుగా 77వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.ప్రతీ ఒక్కరూ దేశసేవకు పునరంకితం కావాలన్నారు. స్వాతంత్ర పోరాటాన్ని గుర్తు చేసుకోవడం, భారతదేశానికి స్వేచ్ఛ కల్పించిన త్యాగధనులను స్మరించుకోడం మనందరి బాధ్యతన్నారు.పోలీసు అధికారులు జాతి సమగ్రత, సమాజంలో శాంతి స్థాపనకు కృషి చేసి మెరుగైన సమాజం దిశగా అడుగువేయాలన్నారు.ఎందరో మహానుభావులు త్యాగఫలమే ఈరోజు మనందరం స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవిస్తున్నామని తెలిపారు. మహానుభావుల త్యాగాలను నిరంతరం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు.పోలీసులు శాంతిభద్రతలు, దేశ సమగ్రత మరియు ప్రజా సేవలో అంకితమవ్వాలన్నారు.ఈ రోజు సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ అన్ని రంగాల్లో ముందుగా ఉందన్నారు.ప్రజల శాంతిభద్రత మరియు మెరుగైన సేవలు అందించడంలో సైబరాబాద్ పోలసులు అగ్రగామిగా ఉన్నారన్నారు.ఈ కార్యక్రమంలో సైబరాబాద్ అడిషనల్ సీపీ అడ్మిన్ అవినాష్ మహంతి, ఐపీఎస్., సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ్ నాయక్, డీసీపీ అడ్మిన్ యోగేష్ గౌతమ్, డీసీపీ ట్రాఫిక్ హర్షవర్ధన్,ఐపీఎస్., సైబర్ క్రైమ్ డీసీపీ రితిరాజ్,ఐపీఎస్., విమెన్&చైల్డ్ సేఫ్టీ వింగ్ డీసీపీ నితికా పంత్, రాజేంద్రనగర్ ఏడీసీపీ రష్మి పెరుమాళ్,ఐపీఎస్., ఈ ఓ డబ్ల్యు డీసీపీ కవిత, బాలానగర్ డిసిపి శిరీష శ్రీనివాసరావు, మాదాపూర్ డీసీపీ సందీప్, శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి, రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, ఏడీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు,ఆర్ఐలు, సెక్షన్ల సిబ్బంది,ఇతర పోలీసు సిబ్బంది, మినిస్టీరియల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.