Home » సైబరాబాద్ పోలీస్ కమీషనర్ గా స్టీఫెన్ రవీంద్ర

సైబరాబాద్ పోలీస్ కమీషనర్ గా స్టీఫెన్ రవీంద్ర

by Admin
890Views

తెలంగాణ మిర్రిర్, గచ్చిబౌలి : సైబరాబాద్ పోలీస్‌ కమిషనర్‌గా ఐపీఎస్‌ అధికారి స్టీఫెన్ రవీంద్ర బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి సైబరాబాద్‌ సీపీగా బాధ్యతలు ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.తనకు ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని అన్నారు. సైబరాబాద్ ఐటీ కారిడార్ భద్రత, సైబర్ క్రైమ్స్, రోడ్ సేఫ్టీలపై ప్రత్యేక దృష్టి పెడతామని అన్నారు.అదే విధంగా, సిటిజెన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ కొనసాగిస్తామని తెలిపారు. సైబరాబాద్ లో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ ని కంటిన్యూ చేస్తూ తెలంగాణా పోలీస్ కి మంచి పేరు తీసుకోస్తామని తెలిపారు.

 

సేవలు సంతృప్తినిచ్చాయి: వీసీ సజ్జనార్
-సైబరాబాద్ ప్రజానీకానికి ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు
గచ్చిబౌలి,మేజర్ న్యూస్ : సైబరాబాద్ ప్రజలకు చేసిన సేవలు సంతృప్తి ఇచ్చాయని మాజీ సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సైబరాబాద్ ప్రజానీకానికి సేవ చేసే అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కి వీసీ సజ్జనార్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ మేరకు ఆయన తెలంగాణ రాష్ట్ర హోమ్ మంత్రి మహమూద్ అలీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ , తెలంగాణ రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి,ప్రజా ప్రతినిధులకు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ , మేడ్చల్ జిల్లా కలెక్టర్ , రంగారెడ్డి జిల్లా జడ్జి , సంగారెడ్డి జిల్లా జడ్జి , మహబూబ్ నగర్ జిల్లా జడ్జి, సీనియర్ ఐఏఎస్, ఐపిఎస్ అధికారులకు, సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్, తెలంగాణ పోలీస్ అధికారులకు., ఐటీ, ఫార్మా, ఇన్ఫ్రా, ఇతర సంస్థలు, ఎస్సీ ఎస్సీ బృందానికి ముఖ్యంగా ప్రతీ ఒక్క అడుగులో వెన్నంటి నడిచి ప్రోత్సహించిన రంగారెడ్డి, మేడ్చల్ ప్రజా సంఘాలకు, ప్రజలకు వీసీ సజ్జనార్ కృతఙ్ఞతలు తెలిపారు.

You may also like

Leave a Comment