
380Views
తెలంగాణ మిర్రర్, గచ్చిబౌలి: మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు గచ్చిబౌలి కమిషనరేట్ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా డీసీపీ అనసూయ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చెడు నుంచి మంచిని అలవరచుకొని ముందుకు సాగేలా వాల్మీకి ప్రేరణకల్పించారన్నారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.