
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో డీసీపీలు, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది తో గురువారం సైబరాబాద్ డీసీపీ (అడ్మిన్) అనసూయ గ్రీవెన్స్ సెల్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. పోలీసుల సమస్యల పరిష్కారానికి సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో గ్రీవెన్స్ సెల్ ను ఏర్పాటు చేసిన విషయం విధితమేనన్నారు. కాగా సిబ్బంది నుంచి గ్రీవెన్స్ సెల్ కు మంచి స్పందన వస్తుందన్నారు. గతవారం గ్రీవెన్స్ సెల్ కు వచ్చిన ఫిర్యాదులు పరిష్కారంపై సీపీ సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే ఈవారం వచ్చిన ఫిర్యాదులను, పెండింగ్ ఫైల్స్ ను త్వరితగతిన క్లియర్ చేయాలన్నారు.ఈరోజు ముఖ్యంగా గత వారం దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారం పురోగతిని పరిశీలించారు. అలాగే రానున్న అక్టోబర్ 21న అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు, స్కూల్ పర్మిషన్స్, ఆర్మ్ డ్ లైసెన్స్, బ్లాస్టింగ్ పర్మిషన్స్, పెట్రోలియం పర్మిషన్స్ తదితర అంశాలపై చర్చించి సత్వరంగా పరిష్కరించాలన్నారు.పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఈసారి ఆన్ లైన్ ఓపెన్ హౌజ్, ఎస్సే రైటింగ్, షార్ట్ ఫిల్మ్, బ్లడ్ డొనేషన్ క్యాంపులు, సైకిల్ ర్యాలీలు తదితర అంశాలు చర్చకు వచ్చాయి.సిబ్బందికి సమస్యలుంటే ఉంటే గ్రీవెన్స్ సెల్(8333993272) ద్వారా తన దృష్టికి తీసుకురావాలన్నారు.ఈ సమావేశంలో విమెన్& చిల్డ్రన్ సేఫ్టీవింగ్ డీసీపీ అనసూయ, బాలానగర్ డీసీపీ పద్మజా, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ చంద్రకళ, చీఫ్ అడ్మిన్ ఆఫీసర్ గీత, వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.