
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : సైబరాబాద్ కమీషనరేట్ పరేడ్ గ్రౌండ్ లో గురువారం నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో సైబరాబాద్ డబ్ల్యు & సిఎస్ డబ్ల్యు , డీసీపీ నితికా పంత్,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.ఈ సంబరాలలో పలు సెక్షన్ల సిబ్బంది వారి కుటుంబ సభ్యులతో పాల్గొని బతుకమ్మ ఆట ఆడి పాడారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ… బతుకమ్మ సంబురాల్లో పోలీసు కుటుంబ సభ్యులందరినీ కలిసినందుకు, వారి కుటుంబసభ్యులతో బతుకమ్మ ఆడటం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ అన్నారు. సిబ్బంది అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విమెన్ & చైల్డ్ సేఫ్టీ వింగ్ డీసీపీ నితికా పంత్, ఐపీఎస్., సీఏఓ అకౌంట్స్ చంద్రకళ,సీఏఓ అడ్మిన్ గీత, షీ టీమ్స్ ఇన్ స్పెక్టర్ సునీత, ఇన్ స్పెక్టర్లు, ఆర్ఐలు, సెక్షన్ల సిబ్బంది, మహిళా పోలీసు సిబ్బంది, మినిస్టీరియల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.