Home » సేవా భావంతో ప్రతి ఒక్కరు ముందుకు రావాలి -సేవా ఫౌండేషన్

సేవా భావంతో ప్రతి ఒక్కరు ముందుకు రావాలి -సేవా ఫౌండేషన్

by Admin
450Views

తెలంగాణ మిర్రర్, శంకర్ పల్లి:  గ్రామీణ ప్రాంతంలో ని నిరుపేద విధ్యార్ధులకు తగిన సహాయం చేయడానికి ముందుకు రావాలని శంకర్ పల్లి సేవా ఫౌండేషన్ ఛైర్మెన్ ఆర్ నరేష్ కుమార్ తెలిపారు. సోమవారం శంకర్ పల్లి మండలం, అంతప్పగూడా గ్రామంలో ని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మాస్కులను ఆయన పంపిణీ చేశారు.కరోనా వ్యాధి పట్ల జాగ్రత్తగా ఉండాలని శుభ్రత , దూరం, మాస్కులు ఈ నియమాలను పాటించాలన్నారు .వివేకానందుడిని ,రుద్రమదేవిలను ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు . ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిద్ధి రామేశ్వర్, టీచర్లు రవీందర్, మహేష్, సేవా ఫౌండేషన్ సబ్యులు పర్వేద వార్డ్ మెంబర్ రవీందర్, నర్సింహా గౌడ్, హరీష్ శంకరా చారి తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment