Home » సూపర్ స్టార్… శివరామకృష్ణమూర్తి ‘కృష్ణ’ ఇకలేరు

సూపర్ స్టార్… శివరామకృష్ణమూర్తి ‘కృష్ణ’ ఇకలేరు

by Admin
10.3kViews
84 Shares

దివికేగిన బుర్రిపాలెం బుల్లోడు.

‘సూపర్‌స్టార్‌’ కృష్ణ ఇకలేరు. 

 తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి, (హైదరాబాద్ ) :  ప్రముఖ నటుడు, నిర్మాత, పద్మాలయా స్టూడియో అధినేత, మాజీ ఎంపీ, పద్మభూషణ్ కృష్ణ (ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి – 79) పార్థీవ దేహనికి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, మంత్రులు తన్నీరు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాత మధు, తక్కెలపల్లి రవీందర్ రావు, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే  అల వెంకటేశ్వర్ రెడ్డి, చైర్మన్లు  మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, ఉప్పల శ్రీనివాస్ గుప్తా లతో కలిసి కృష్ణ పార్థివ దేహం పై పుష్ప గుచ్ఛం ఉంచి, శ్రద్ధాంజలి ఘటించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి ని తెలియచేసి నివాళులర్పించిన ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ కృష్ణ లేని లోటు తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు అని 350కి పైగా సినిమాలలో నటించిన అగ్రశ్రేణి నటుడు, తెలుగు సినిమా పరిశ్రమలో అనేక ప్రయోగాలతో నూతన ఒరవడిని సృష్టించారు అని ప్రభుత్వ విప్ గాంధి పేర్కొన్నారు. తెలుగు సినిమా పరిశ్రమకు 50 ఏండ్ల పాటు సేవలు అందించారు. తెలుగు సినీమా ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిన బుర్రిపాలెం బుల్లోడు, అల్లూరి సీతారామరాజు, కౌబాయ్, జేమ్స్ బాండ్ గా తెలుగు అభిమానుల హృదయాలలో స్థానం సంపాదించుకున్నారని అన్నారు. సూపర్ స్టార్ కృష్ణ ఐదున్నర దశాబ్దాలకుపైగా తెలుగు తెరను ఏలిన నటశేఖరుడు, సంచలన నిర్ణయాలతో అంతకు మించిన పట్టుదలతో వెండి తెరపై హేమాహేమీలను ఢీకొట్టిన ఘనుడు, పౌరాణికం, జానపదం, సాంఘికం, చారిత్రకం ఇలా ప్రతి సినిమాలో తనదైన ముద్రవేసిన కృష్ణ తెలుగోళ్ల జేమ్స్ బాండ్ గా, కౌబాయ్ గా అలరించి తెలుగుతెర ఎరుగని ఎన్నో హంగులు పరిచయం చేసి మన వెండితెర స్థాయిని ఆమాంతం పెంచేశారు. , కృష్ణ జీవితం ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం అని అన్నారు. సూపర్ స్టార్ కృష్ణ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నా, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను అని, వారికి ధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

You may also like

Leave a Comment