Home » సీసీ రోడ్డును పరిశీలించిన ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

సీసీ రోడ్డును పరిశీలించిన ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

by Admin
1.1kViews

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ శాఖమంత్రికేటీఆర్ దిశానిర్దేశంలో ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం సాగేలా యుద్ధ ప్రాతిపదికన రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని శేరిలింగంపల్లి శాసనసభ్యులు,ప్రభుత్వ విప్ అరేకపూడి గాంధీ ,మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని చంద్ర నాయక్ తండా నుండి పర్వత్ నగర్ జుంక్షన్ వరకు నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును స్థానిక ప్రజలు, నాయకులతో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ,కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పరిశీలించారు.ఈ సందర్బంగా గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రతి డివిజన్ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేసి అభివృద్దే ప్రధాన ఎజెండాగా పనులు పూర్తి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సయ్యద్ గౌస్,హున్య నాయక్,మాదాపూర్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్,మాదాపూర్ డివిజన్ ఎస్.టి సెల్ అధ్యక్షులు లాలూ నాయక్,డివిజన్ నాయకులు సాంబయ్య,నర్సింహ,రాములు,ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వెంకటేష్ గుప్త,రాజు,అశోక్,శ్రీనివాస్ గుప్త, లక్ష్మినారాయణ, రామాంజనేయులు, ఖున్య,ఉన్నూర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment