
10.2kViews
89
Shares
శేరిలింగంపల్లి,తెలంగాణ మిర్రర్ : శేరిలింగంపల్లి నియోజవకర్గం కొండాపూర్ డివిజన్ గపూర్ నగర్‌కు చెందిన వెంకట నాగ సుజాతకు అత్యవసర చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి పథకం కింద మంజూరైన రూ. 2 లక్షల 50 వేల ఆర్థిక సాయం మంజూరు పత్రాలను బాధిత కుటుంబానికి కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి విప్ ఆరెకపూడి గాంధీ బుధవారం తన నివాసంలో అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికంతో బాధపడుతూ అనారోగ్యాల బారిన పడుతున్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందించటం ద్వారా ప్రభుత్వం భరోసాగా నిలుస్తున్నదన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అబీబ్ బాయ్ ,అష్రాఫ్ తదితరులు పాల్గొన్నారు.