Home » సీఎం కేసీర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేపీ నాయకులు

సీఎం కేసీర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేపీ నాయకులు

by Admin
970Views

శేరిలింగంపల్లి (తెలంగాణ మిర్రర్) :  గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని విప్రో సర్కిల్ వద్ద బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే  హన్మంతరావు  స్థాయి మరచి విమర్శించడం అధికారాన్ని దుర్వినియోగ పరచడమే కాకుండా  సామాన్య ప్రజలపై దాడులు చేయడం, దౌర్జన్యాలు చేయడం, ప్రశ్నించే గొంతుకలపై కొంతమంది  అనుచరులతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. బండి సంజయ్ కుమార్ పై మీరు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని వెంటనే క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. బిజెపి కార్పొరేటర్ మీద జరిగిన దాడిని నైతిక బాధ్యత వహిస్తూ డిజిపి  వెంటనే ఎమ్మెల్యే పై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కృష్ణ ముదిరాజ్ ,జిల్లా కార్యదర్శి మూల అనిల్ గౌడ్ , రాష్ట్ర రంగారెడ్డి జిల్లా సంయుక్త కార్యదర్శి రవీందర్ రెడ్డి , రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్ , డివిజన్ ప్రధాన కార్యదర్శి చెట్టి మహేందర్ గౌడ్  గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ వెంకటేష్ , దయాకర్ తిరుపతి ,గచ్చిబౌలి డివిజన్ ఐటీ సెల్ కన్వీనర్ రాఘవేంద్ర , శేరిలింగంపల్లి డివిజన్ బీజేపీ కంటెస్టెడ్ కార్పొరేటర్ కంచర్ల ఎల్లేష్ , సీనియర్ నాయకులు వసంత్ కుమార్ యాదవ్ , శ్రీరాములు, ధనరాజ్ సింగ్, సుబ్రమణ్యం, హరీష్ శంకర్ యాదవ్ ,కిషన్ సింగ్, అనిల్ ,మన్నే రమేష్ , రంగస్వామి , వేణు ,శివ ప్రసాద్ , శ్రీనివాస్ , క్రాంతి, ప్రశాంత్, శ్రీనివాస్, రాజు , సతీష్, మధు, కృష్ణా, ప్రవీణ్ , దినేష్ , విజయ్, గుండప్పా, రాజు తదితరులు  పాల్గొన్నారు.

You may also like

Leave a Comment