Home » సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటాం: అమీన్‌పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగ రెడ్డి

సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటాం: అమీన్‌పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగ రెడ్డి

by Admin
490Views

* రాష్ట్రంలో మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతా…

* 5 ఎకరాల స్థలంలో స్టేడియం ఏర్పాటు…

*వైకుంఠ దామాన్ని మహాప్రస్థానంగా మారుస్తాం : చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి

*సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం 

తెలంగాణ మిర్రర్,పటాన్‌చెరు : సీఎం కేసీఆర్ ఆశీస్సులతో అమీన్‌పూర్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం అమీన్‌పూర్ లోని ఆయన  నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమీన్‌పూర్ మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు మంజూరు చేయడం పట్ల సీఎం కేసీఆర్ కు పాండురంగారెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అమీన్‌పూర్ మున్సిపాలిటీ ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారూ.110 కోట్ల రూపాయల నిధులతో మిషన్ భగీరథ,ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకుల నిర్మాణంతో పాటు మున్సిపాలిటీ పరిధిలోని ఇంటింటికి మంచినీటి సరఫరా పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు.ప్రభుత్వం‌ మంజూరుచేసిన కోటి రూపాయలు,కౌన్సిల్ ద్వారా రూ.50 లక్షల నిధుల వ్యయంతో 5 ఎకరాలలో చేపడుతున్న వైకుంఠధామాన్ని అభివృద్ధి చేసి మహాప్రస్థానంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. 5 ఎకరాల స్థలాన్ని దాతలు అందజేసిన రూ‌. 47 లక్షలతో చదును చేసి స్టేడియాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. త్వరలో మంత్రి హరీష్ రావును ఆహ్వానించి ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ మార్కెట్ ఏర్పాటు చేసుకోనున్నట్లు తెలిపారు.అదేవిధంగా అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందజేసేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి స్థలాన్ని కేటాయింపజేసుకుని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ప్రతి కాలనీలో యూజీడీ,సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామని చైర్మన్ పాండురంగారెడ్డి చెప్పారు.రెడ్డి కాలనీ నుంచి బొల్లారం వరకు రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు చేయనున్నట్లు తెలిపారు.దశల వారీగా అమీన్ పూర్ మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకుంటూ ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు.అమీన్‌పూర్ మున్సిపల్ కౌన్సిలర్లు,ప్రజలందరి తరపున మంత్రి హరీష్ రావుకు,ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కి,ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి హరీష్ రావు,ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నర్సింహా గౌడ్,కౌన్సిలర్లు బాశెట్టి కృష్ణ,కొల్లూరి మల్లేష్,బిజిలి రాజు,ప్రమోద్ రెడ్డి, కో ఆప్షన్ మెంబర్లు తలారి రాములు,యూసుప్ అలీ,చంద్రకళ గోపాల్,భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయ కమిటీ చైర్మన్ తులసి రెడ్డి,అమీన్‌పూర్ మున్సిపల్ పార్టీ అధ్యక్షుడు బాల్ రెడ్డి,నాయకులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

 

       

You may also like

Leave a Comment