Home » సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు : కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి

సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు : కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి

by Admin
970Views

*రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం 

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : అసెంబ్లీ సాక్షిగా 80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, వయోపరిమితి పెంపు, 11,103 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యూలరైజ్‌ చేస్తూ సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయమని నిరుద్యోగుల పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి అన్నారు.గురువారం చందానగర్ డివిజన్ పరిధిలో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో డివిజన్ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డీ టిఆర్ఎస్ నాయకులు కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ తేలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు నీళ్లు,నిధులు,నియామకాలు నేరవేర్చడం జరుగుతుందని.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తేలంగాణ రాష్ట్రాన్ని హరిత తేలంగాణగా అభివృద్ధి చేయడం జరుగుతుందని. .ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ సంస్థలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టి వారి కార్యకలాపాలు ఇక్కడి నుంచి సాగిస్తున్నాయాని అన్నారు.సీఎం కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షులు,ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అభివృద్ధి రాష్ట్రంగా రూపుదిద్దుకుంటుందని కార్పొరేటర్ అన్నారు.ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు ధనలక్ష్మి ,వరలక్ష్మి రెడ్డి,పులిపాటి నాగరాజు,ఓ.వేంకటేష్ ,అక్బర్ ఖాన్, మిర్యాల ప్రితం , యేలమయ్య ,దాసు,హరిష్ రెడ్డి ,నరేంద్ర,గౌరవ్,రాజశేఖర్ రెడ్డి ,ఖాదర్,శ్రీనివాస్ , తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment