
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : ముఖ్యమంత్రి సహాయనిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటుందని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఆల్విన్ కాలనీ,హైదర్ నగర్, చందానగర్,హఫీజ్ పెట్,మాదాపూర్,కూకట్ పల్లి డివిజన్లకు చెందిన బాధిత కుటుంబాలకు శుక్రవారం ప్రభుత్వ విప్ గాంధీ వివేకానంద నగర్ లోని ఆయన నివాసంలో సిఏంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ.8 లక్షల 18 వేల చెక్కులను కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్,ఉప్పలపాటి శ్రీకాంత్,మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబాలతో కలిసి అందజేశారు.ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ సీఎంఆర్‌ఎఫ్ పథకంతో పేదలకు కార్పొరేట్ దవాఖానల్లో వైద్యం అందుతున్నదన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని వివరించారు.ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి,తెరాస నాయకులు గణేష్ ముదిరాజు, చంద్రారెడ్డి,బ్రిక్ శ్రీను,కాశినాథ్ యాదవ్,శ్రీనివాస్ చౌదరీ, పోశెట్టి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.