
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : దేశవ్యాప్తంగా వామపక్ష కార్మిక సంఘాలు చేపట్టిన సార్వత్రిక సమ్మె రెండో రోజు కూడా కొనసాగింది.ఈ మేరకు మంగళవారం శేరిలింగంపల్లి వామపక్ష కార్మిక సంఘాలు చందానగర్ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా వామపక్ష కార్మిక సంఘాల నాయకులు శోభన్,రామకృష్ణ,నారాయణ లు మాట్లాడుతూ లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటైజేషన్ తక్షణమే విరమించుకోవాలని,జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కూలీలకు వేతనాలు పెంచాలని, కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్ఐసి, బిహెచ్ఎల్, రైల్వే రంగాలను గుజరాత్ వ్యాపారులకు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ యత్నాలను కేం ద్రం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. బ్యాం కులు, బీమా సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పగించే ప్రయత్నాలను నిలిపివేయాలని నినదించారు. ఈ సమ్మెకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షులు అభిషేకం అందం పాల్గొని మద్దతు తెలిపారుఈ కార్యక్రమంలో వామపక్ష కార్మిక సంఘాల నాయకులు,కృష్ణ మూదిరాజ్, అభిషేక్, సహన నారాయణ తదితరులు పాల్గొన్నారు.