
550Views
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని లింగంపల్లి సాయి బాబా దేవాలయంలో వి హెచ్ పి శేరిలింగంపల్లి ప్రకండ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వామిజీ దామగుండం సత్యానంద స్వామి జీ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, సీనియర్ నాయకులు రవి కుమార్ యాదవ్ ,వి హెచ్ పి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి, వి హెచ్ పి నాయకులు కృష్ణ రెడ్డి , రవీందర్ రెడ్డి, కృష్ణ , బీజేపీ సీనియర్ నాయకులు ఎల్లేశ్ , కోటేశ్వరరావు, భారత్ , శోభ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తదనంతరం వరలక్ష్మి వ్రతం కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు చీరలు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందు సాంస్కృతి సంప్రదాయాలను అందరూ ఆచరించి భగవంతుని కృపకు పాలుపంచుకోవాలని కోరారు.